– హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు
హైదరాబాద్: దివ్యాంగుల ఇంటర్ జోనల్ టీ20 టోర్నమెంట్‌ను భారత క్రికెటర్ తిలక్ వర్మతో కలిసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు సోమవారం ఉప్పల్ స్టేడియంలో ప్రారంభించారు. ‘హెచ్‌సీఏ దివ్యాంగ క్రికెటర్లను ప్రోత్సహిస్తుంది. అందరిలాగే క్రికెట్ ఆడగలమని నిరూపించిన దివ్యాంగులకు అభినందనలు’ అని జగన్ అన్నారు. డీఏసీహెచ్ అధ్యక్షుడు సురేందర్ అగర్వాల్, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి జాన్ మనోజ్, మాజీ ఉపాధ్యక్షుడు మొయిజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.