ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ

to Australia
Another setback–  ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి వైదొలిగిన స్టార్క్‌
– కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌
సిడ్నీ: ఛాంపియన్‌ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆసీస్‌ స్టార్‌ పేసర్లు హేజిల్‌వుడ్‌, కమిన్స్‌తోపాటు మిఛెల్‌ మార్ష్‌ ఇప్పటికే ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరం కాగా.. తాజాగా స్టార్‌ పేసర్‌ మిఛెల్‌ స్టార్క్‌ ఈ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సిఎ) సెలెక్షన్‌ ప్యానల్‌ సభ్యులు జార్జి బెయిలీ బుధవారం తెలిపారు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే ఆసీస్‌ జట్టుకు కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌ వ్యవహరించనున్నట్లు సిఎ బుధవారం ప్రకటించింది. పాకిస్తాన్‌ వేదికగా ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫిబ్రవరి 19నుంచి మార్చి 9వరకు జరగనుంది. ఆస్ట్రేలియా జట్టు 2006, 2009లలో ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటిళ్లను చేజిక్కించుకుంది.
జట్టు: స్మిత్‌(కెప్టెన్‌), అబాట్‌, క్యారీ, డ్వార్షిస్‌, ఎల్లిస్‌, ఫ్రేసర్‌, హార్డి, హెడ్‌, ఇంగ్లిస్‌, జాన్సన్‌, లబూషేన్‌, మ్యాక్స్‌వెల్‌, సాంఘ్వా, స్టార్క్‌, జంపా. రిజర్వ్‌: కొన్నొల్లె.

Spread the love