– దాతలను సన్మానించిన చైర్మన్ నరాల శ్రీను…
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని వినాయక పురం లో గల శ్రీ శ్రీ శ్రీ చిలకల గండి ముత్యాలమ్మ దేవాలయం ప్రాంగణంలో షెడ్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్, కుక్కునూరు మండల వాస్తవ్యులు,టీడీపీ కుక్కునూరు మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరావు (నాగు), ఉష రాణి దంపతులు రూ.50 వేలు విరాళంగా అందజేసారు. శుక్రవారం వారి కుమారులు జయంత్ కుమార్,ఉజిత్ కుమార్ లు దేవాలయాన్ని సందర్శించి,ముత్యాలమ్మ ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నరాల శ్రీను శాలువా కప్పి సన్మానం చేశారు.వేద పండితులు ఆశీర్వదించారు.ఆ దంపతులపైన చిలకల గండి ముత్యాలమ్మ తల్లీ ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమం ఆలయం గుమస్తా ప్రసాద్,టెంట్ హౌస్ పాషా,శేఖర్ కుమార్ పంతులు పాల్గొన్నారు.