పోలింగ్ కేంద్నాన్ని పరిశీలించిన తహశీల్దార్, సీఐ

Tahsildar, CI who inspected the polling station– ప్రతీ ఉపాధ్యాయ ఓటరు తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట
గురువారం జరగనున్న ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ లో అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు తన ఓటు హక్కును వినియోగించుకొని విజయవంతం చెయ్యాలని
తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ అన్నారు. బుధవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ కేంద్రాన్ని ఆర్.ఐ పద్మావతి తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా తహశీల్దార్  మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులు అందరూ ప్రశాంతమైన వాతావరణం లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నియోజక వర్గంలో 6 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతుందని ఆయన తెలిపారు.పీవో లు,ఏపీవో లకు పోలింగ్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు చేపట్టవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.ఓటర్లుఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లు ఉండవు.బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది.బ్యాలెట్ పేపర్ పై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు, ఫొటో ఉంటాయి.ప్రాధాన్య క్రమంలో ఓటరుకు నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న గడి లో “1” నెంబరు వేయాలి. ఎన్నికల. అధికారులు ఇచ్చిన వాయిలెట్ పెన్ను తో మాత్రమే వేయాలి అని కలెక్టర్ సూచించారు. ఓటర్లు ఎన్నికల సంఘం అనుమతించిన ఏదేని గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని సూచించారు. ఓటర్లకు వారి యొక్క క్రమ సంఖ్య వివరాలు తెలిసే విధంగా పోలింగ్ కేంద్ర వద్ద ఓటర్ రికగ్నైజేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరిశీలనలో ఆయన వెంట ఎలక్షన్ స్థానిక సిబ్బంది,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ సాయుధ నిఘాలో పోలింగ్ కేంద్రం : సీఐ కరుణాకర్..
ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కో ఎస్ఐ,ఇద్దరు కానిస్టేబుల్ లు,సాయుధ నిఘా కాస్తారని సీఐ కరుణాకర్ అన్నారు.బుధవారం పోలింగ్ కేంద్రానికి చేరిన ఎన్నిక సిబ్బంది,పోలింగ్ సామాగ్రిని కేంద్రం లో పరిశీలించారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నామని అన్నారు.ఆయన వెంట ఆర్.ఐ క్రిష్ణ,పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Spread the love