– రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
– తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
నవతెలంగాణ- సుల్తాన్ బజార్
దేశంలో అత్యధిక వేతనాలు ఉన్న ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెం డర్ ఆవిష్కరణ కార్యక్రమం కోఠిలోని డీఎమ్ఈ ఆడిటోరి యంలో అధ్యక్షుడు కలిముద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సరాన్నికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్ని చెప్పి, ఇప్పుడుఉద్యోగాలు ఉడా కొడుతున్నారన్నారు. ఉద్యోగులకు ఈ హెచ్ ఎస్ కోసం కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నామని.. త్వరలోనే విధివిధానాలు వస్తాయని చెప్పారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కంటి వెలుగు లాంటి కార్యక్రమం పెట్టి ప్రజలకు కంటి పరీక్షలు చేయాలని, ఆ ఆలోచన చేసిన ఏకైక సీఎం మన కేసీఆర్ అని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు ఏమైనా మిగిలి ఉంటే త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి మమత. ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసి యేషన్ అధ్యక్షులు కలిముద్దీన్. ప్రధాన కార్యదర్శి కే శ్రీనివా సులు. అసోసియేట్ ప్రెసిడెంట్ ఎస్ రామాంజనేయులు. కోశాధికారి చంద్రశేఖర రావు. వివిధ జిల్లాల డిఎంహెచ్ ఓ లు. ఉద్యోగులు పాల్గొన్నారు