- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం రాయిచెడు గ్రామంలో సోమవారం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు జరిగిన ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ తోళ్ల ఆనంద్, సింగిల్ విండో డైరెక్టర్ బోడ లింగమయ్య, సీనియర్ నాయకులు బోడ మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దలు,యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళలకు రేషన్ కార్డులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రజా ప్రభుత్వం రేవంత్ సర్కార్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, “ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం” అంటూ పేద ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
- Advertisement -