నవతెలంగాణ – మల్హర్ రావు
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని, కాళేశ్వరంలో ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సరస్వతి పుష్కరాల్లో భాగంగా ప్రభుత్వం అత్యవసర వైద్య సేవల కోసం 108 వాహనాలు ఏర్పాటు చేశారు. పుష్కరాల్లో 108 ఉద్యోగులు సందర్శకులకు అందించిన సేవలను గుర్తించిన ప్రభుత్వం 108 జిల్లా సూపర్ వైజర్ మెరుగు నరేశ్ యాదవ్, తాడిచర్ల 108 అంబులెన్స్ మెడికల్ టెక్నీషియన్ గుగ్గిళ్ల మహేష్,రేగొండ 108 వాహనం పైలెట్ వార్కడి రవి లకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతులమీదుగా ఉత్తమ ఉద్యోగుల అవార్డులు,ప్రశంస పత్రాలు అందజేశారు.
108 ఉద్యోగుల సేవలకు ఉత్తమ అవార్డులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES