నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నందు ఫ్రీ – ప్రైమరీ స్కూల్ ను జుక్కల్ ఎంఈఓ తిరుపతయ్య ప్రారంభించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజయ్య తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం రాజయ్య మాట్లాడుతూ పెద్ద ఎడ్గి ప్రాథమిక పాఠశాల నందు ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రారంభించడం వలన నాలగు సంవత్సరాలు పూర్తీ చేసుకున్న పైబడిన పిల్లలకు ప్రత్యేకంగా విద్యాబోధన ఇన్స్ట్రక్టర్ సాయంతో బోధన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చిన్ననాటి నుండి పిల్లలకు బడిపైన మక్కువ కలిగే విధంగా అవగాహన , ఆసక్తి కనబరిస్తారని ముఖ్య ఉద్దేశంతో విద్యాభివృద్ధి గణనీయంగా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఆలోచన విధానంతో ప్రభుత్వం ఆలోచించి ఫ్రీ ప్రైమరీ స్కూలు ప్రారంభించడం జరుగుతున్నాయని తెలిపారు.
అదేవిధంగా పెద్ద ఏడ్గి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజయ్య పిల్లలకు తన సొంత ఖర్చుతో పలకలు పంచడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల విద్యాధికారి తిరుపతయ్య, గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లాలయ్య, గ్రామ పెద్దలు, అందరూ కలిసి పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతకుముందుగా పూజా కార్యక్రమం నిర్వహించి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రీ ప్రైమరీ పాఠశాలలు నాలుగు సంవత్సరాల పైబడి వయసు ఉన్న వారందరూ చేరవచ్చు కావున గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు ప్రీ ప్రైమరీ కొరకు ప్రత్యేకంగా బ్యాగులు చైర్స్ మరియు ఆట వస్తువులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మరియు నాణ్యమైన యూనిఫామ్ తో పాటు షూ కూడా అంది స్తుంది అని తెలిపారు.



