
మండలంలోని మందాపూర్, దర్మొరా గ్రామాల మధ్య వర్షాలకు బిటి రోడ్డు కోతకు గురైంది. రెండు గ్రామాల మధ్య బిటి రోడ్డు వర్షాల వల్ల కోతకు గురి కావడంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాహనదారులు ప్రయాణం ప్రమాదకరంగా ఉందని అంటున్నారు. రెండు వాహనాలు ఒకే సారి వెళ్లలేని పరిస్థితి ఉందని, ఒక్కటి వచ్చిందంటే మరొక్కటి ప్రక్కకు వెళితే గుంతలో పడీ ఇరుకోవల్సిందేనాని స్థానికులు తెలిపారు. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి రోడ్డుకు ఇరి వైపులా మరమత్తులు చేయించాలని కోరారు.