- Advertisement -
నవతెలంగాణ – వెల్డాండ
వెల్దండ మండల కేంద్రంతో పాటు పరిధిలోని కంటోనీ పల్లి, కుప్ప గుడ్ల, కొట్ర గ్రామంలో బహుజనుల విప్లవ వీరుడు యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్ర పటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు వెంకటయ్య గౌడ్, విష్ణు , మదన్, నాగేశ్వర్, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -