నవతెలంగాణ -మంగపేట
1 నుండి 19 సంవత్సరాలు నిండిన విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించి నులిపురుగుల నివారణ, కండ్ల కలక వ్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యురాలు యమున అన్నారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా చుంచుపల్లి ఆసుపత్రి పరిధిలోని జడ్పీహెచ్ఎస్, ఏహెచ్ఎస్, ఎంపీఎస్ పాఠశాలలోని విద్యార్థుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా యమున మాట్లాడుతూ 1-19 సంవత్సరాల పిల్లలకి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ 400 ఎంజి మాత్రలను ఇవ్వడంతో పాటు పిల్లలందరికీ చేతులను కడుక్కునే విధానం, వ్యక్తిగత పరిశుభ్రత, కండ్ల కలక గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యుడు వేణు, పీహెచ్ఎన్ శైలజ, హెచ్వీ ముత్తమ్మ, ఏఎన్ఎం, ఆశలు, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.