- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి : జనసేన పార్టీని పటిష్టం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు మేడిద ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తలు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, భవిష్యత్తు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళతామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి జనసేన సిద్ధాంతాలను తీసుకువెళ్తామన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాచర్ల సాంబరాజు, ఆకుల సైదులు, మాడరాజు అశోక్, భూక్య బాలు నాయక్, పూజారి సాయి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -