Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న సర్ సర్వే

కొనసాగుతున్న సర్ సర్వే

- Advertisement -

ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న తహశీల్దార్
నవతెలంగాణ – మల్హర్ రావు

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఈ నెల 25 నుంచి ప్రారంభమైంది.మండలంలోని 15 గ్రామపంచాయతీల పరిధిలోని 118 వార్డుల్లో 24 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఎలకు అధికారులు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తున్నారు.బీఎల్ఎలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అందజేస్తున్నారు.ఈ ప్రక్రియను మండల తహశీల్దార్ రవికుమార్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు బీఎల్ఓలు ఇంటింటికీ సర్వే నిర్వహించి, ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తున్నట్లు తెలిపారు.ఓటర్లు తమ పూర్తి వివరాలను ఫారాల్లో నింపి,తిరిగి బీఎల్ ఓలకు అందజేయాలన్నారు.జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా,అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారులు తయారు చేయనున్నట్లుగా తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్క ఓటరు పేరు ఎట్టి పరిస్థితిలో తప్పిపోకుండా చూడాలన్నారు.అదేవిధంగా అనర్హుల ఓట్లను తొలగించాలన్నారు.మండలంలో మొత్తం 22,765 ఓట్లు ఉండగా 11315 పురుషులు,11,450 మహిళల ఓట్లు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -