- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభు రాజరాజేశ్వర ఆలయంలో మంగళవారం ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ల పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ఉచిత పంపిణీ చేసినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ మొరం శెట్టి రాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మార్క అనిల్ గౌడ్ , శాలివాహన భక్త సమాజం వ్యవస్థాపకులు కానుగుల మోహన్, సిపిఐ నాయకులు మడిశెట్టి శ్రీధర్, పోగుల సంతోష్, ఆలయ పూజారి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -