- Advertisement -
- – హాజరైన ఆయా శాఖల జిల్లా అధికారులు
- నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
- వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా వినాయకుడికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడు జిల్లా ప్రజలను అందరిని సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ… అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసారు.ప్రజలందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని, మన పర్యావరణాన్ని కాపాడాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, ఏఓ రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంచందర్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, డీ డబ్ల్యూఓ లక్ష్మీరాజం, ఎల్డీఎం మల్లికార్జునరావు, తహసీల్దార్లు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -