- Advertisement -
నవతెలంగాణ- ఆత్మకూరు
వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రాథమిక సహకార సంఘం నందు గురువారం ఏరియా పంపిణీ కొనసాగుతున్నట్లు పిఎసిఎస్ సీఈవో సురేష్ తెలిపారు. గురువారం ఉదయం ఒక లారీ లోడ్ రావడంతో 300 బ్యాగులు పంపిణీ చేసినట్లు అని తెలిపారు. బుధవారం రోజు టోకెన్ తీసుకున్న వారికి ఈరోజు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు టెంటు మంచినీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఆత్మకూరు రెండవ ఎస్ఐ హిమబిందు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
- Advertisement -