Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాలేశ్వరంపై సీబీఐ విచారణ సిగ్గుచేటు 

కాలేశ్వరంపై సీబీఐ విచారణ సిగ్గుచేటు 

- Advertisement -

దర్యాప్తు వెనుక కాంగ్రెస్ కుట్ర 
రేవంత్ రెడ్డి చెప్పేదొకటి చేసేది ఒకటి 
తెలంగాణ ప్రజలను నిండా ముంచి సీఎం అయిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 
బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

కాలేశ్వరంపై సిబిఐ విచారణ సిగ్గుచేటని బీఆర్ఎస్ నగర అధక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారంనిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే  గణేష్ బిగాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు తోనే కాలేశ్వరంపై నిందలు వేస్తుంది. ఎలక్షన్స్ ఉన్నాయంటే చాలు కాలేశ్వరాన్ని ముందు పెట్టి ఓట్లు దండుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేశారు. సిబిఐ దర్యాప్తు వెనుక రేవంత్ బాబుల అస్త్రం ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ బిజెపి ఒకటి కాకుంటే సీబీఐకి ఎందుకు అప్పగిస్తారు.

కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయ వంటిది. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ కాలేశ్వరం. లేనిపోని నిందలు వేసి కాలేశ్వరం ప్రాజెక్టును పక్క ద్రోవ పట్టించి ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇవ్వాలని ఉద్దేశంతో ఆంధ్ర పాలకుడైన రేవంత్ రెడ్డి నాటకం ఆడుతున్నాడు. కాలేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిందలు వేసి కాలేశ్వరం ప్రాజెక్టుని ఎలా కూల్చాలో చూస్తుంది. తెలంగాణ ప్రజలు ఎలా ఉన్నారు? అభివృద్ధి ఎలా ఉంది అనే విషయాన్ని పక్కన పెట్టి నోరు విప్పితే కేసిఆర్ తప్ప వేరే మాటే లేకుండా పోయింది.

కెసిఆర్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ప్రతి ఎన్నికల ముందు ఇలాంటి నాటకాలు ఆడటం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. కెసిఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని తెలంగాణ ప్రజలే హెచ్చరిస్తున్న వినకుండా పదే పదే కేసీఆర్ని కలవరిస్తున్న రేవంత్ రెడ్డికి త్వరలోనే తగిన శాస్త్రి జరుగుతుంది ఈ కార్యక్రమంలో సత్యప్రకాష్ సుజిత్ సింగ్,నవీద్ ఇక్బాల్, గాండ్ల లింగం,మాకురవి,పాట సంతోష్, సదానంద్ ,చింతకాయల రాజు,,మల్కై మహేందర్ ,ఆకాష్, విఠల్,మధుకర్ రెడ్డి, అగ్గు సంతోష్,శ్రీనివాస్ గౌడ్,గంగామణి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad