- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలం మదన్ హిప్పర్గ గ్రామ మాజీ సర్పంచ్ రాజు పటేల్ గత కొన్ని రోజుల క్రితం బైక్ నుంచి స్కిడ్ అయి కిందపడ్డాడు. దీంతో ఆయన కాలుకు ప్యాక్చర్ అయ్యింది. గత కొన్ని రోజులుగా ఆయన చికిత్స నిమిత్తం ఇంటివ వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే మంగళవారం రాజు పటేల్ ను పరామర్శించారు. కాలుకు గాయం గురించి ఎలా జరిగిందనే దానిపై అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం భారీ కురుస్తున్నాయి.. కావున బయట తిరగవద్దని, కొన్ని రోజులు బైక్ పై తిరగవద్దని సూచించారు.
- Advertisement -