- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన నవీన్ కుమార్ (31) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నవీన్ కుమార్ మక్కల లోడుతో డీసీఎం వాహనంలో తూప్రాన్ వెళ్లి సరుకును అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా.. ఎన్‌హెచ్-44 పై అడ్లూరు శివారులోకి రాగానే వాహనం అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి శారద ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -



