నవతెలంగాణ-హైదరాబాద్: బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. బాలికను లైంగికంగా వేధించిన కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నారు. అయితే పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కోసం పోలీసులు ఇప్పటికే వెతుకున్నారు. నాలుగు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపడుతుండగా, భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
కేసు నమోదైన తర్వాత పోలీసులు కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్‌లో బండి భగీరథ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అంతేకాకుండా ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని బండి సంజయ్ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. భగీరథ్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నవారి వివరాలను సేకరించారు. అయితే తాజాగా న్యాయవాదుల సమక్షంలో భగీరథ్ లొంగిపోయారు.



