- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అంగడిలో ప్రకృతి సంరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నివారణ చర్యలు నిమిత్తం జూట్ బ్యాగులను శనివారం సాయంత్రం సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ పంపిణీ చేశారు.గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ చర్యలో భాగంగా ఈ జ్యూట్ బ్యాగులు పంపిణీ చేసినట్లు సర్పంచ్ హారిక తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షులు మల్యాల సుభాష్ గౌడ్, క్యాషియర్ పన్నల రవీందర్, పంచాయతీ కార్యదర్శి గంగజమున, కాంగ్రెస్ నాయకులు గోవింద్ శేఖర్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



