Saturday, May 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనుమతి లేని మద్యం దుకాణాలపై ఎక్సైజ్ ఉక్కుపాదం

అనుమతి లేని మద్యం దుకాణాలపై ఎక్సైజ్ ఉక్కుపాదం

- Advertisement -

– మండలంలో విస్తృత దాడులు.. మద్యం, బీరు స్వాధీనం – నలుగురిపై కేసులు
నవతెలంగాణ – ఉప్పునుంతల

నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలో అనుమతులు లేని మద్యం గొలుసు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు శనివారం విస్తృత దాడులు నిర్వహించారు. ఈ విషయాన్ని తెలకపల్లి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఉప్పరపల్లి, పెనిమెల్ల, కంసానిపల్లి, వెల్టూర్ గ్రామాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టి 1.25 లీటర్ల మద్యం, 8 లీటర్ల బీర్లు స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వెల్టూర్ బాలాజీ వైన్ షాపులో కూడా సోదాలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు, నిషేధిత నాటుసారా, గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని చెప్పారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై సృజన్ కుమార్, అరుణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -