బీసీ ఓవర్సీస్‌ విద్యానిధికి దరఖాస్తులు

– కమిషనర్‌ బుర్రా వెంకటేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్‌ విద్యా నిధి పథకం కింద ఆర్ధిక సహాయం పొందేందుకు అర్హులైన బీసీ, ఈబీసీి అభ్యర్దులు దరఖాస్తులు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ బుర్రా వెంకటేశం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద విదేశాల్లో పీజీ విద్యను అభ్యసించాలనుకునే బీసీ,ఈబీసీి విద్యార్దులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2023) సెప్టెంబర్‌, అక్టోబర్‌ సెషన్‌కు సంబంధించి అభ్యర్దుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వచ్చే నెల ఒకటి నుంచి చివర వరకు ముగుస్తుందని తెలిపారు. ఇతర వివరాలకు, ఆన్‌లైన్‌అప్లికేషన్లకు http://www.telanganae pass.cgg.gov.in వెబ్‌ సైట్‌ ను సంప్రదించాలని సూచించారు.

Spread the love