మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పరామర్శ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
డెంగ్యూ వ్యాధితో మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వడాయిగూడెం గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం డెంగ్యూ వ్యాధితో బుజ్జమ్మ బాధపడుతుండగా భువనగిరి ప్రయివేట్ హాస్పిటల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్ ప్లేట్లెట్స్ తగ్గాయని, హైదరాబాదులో ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్ళండని సూచించారు. దీంతో బుజ్జమ్మ పరిస్థితి విషమించి చనిపోయింది. కాగా విషయం తెలుసుకున్న భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బీరు మల్లయ్య, మండల అధ్యక్షుడు జనగాం పాండు,నీల ఓం ప్రకాష్ గౌడ్, గుండు ముత్తయ్య గౌడ్, శెట్టి శ్రీకాంత్, యాదగిరి, చంద్రయ్య , పలువురు నాయకులు పాల్గొన్నారు.
డెంగ్యూతో మహిళ మృతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES