Wednesday, June 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కేసు న‌మోదు

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కేసు న‌మోదు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కేసు న‌మోదు అయింది. దివంగ‌త గ‌ద్ధ‌ర్ ప‌ట్ల అనుచితంగా, పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు మాట్లాడార‌ని బుధవారం నాడు మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఎల్.బి. నగర్ పోలీస్ స్టేషన్‌లో ఒక అధికారిక ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదును న్యాయవాదులు ఫణీంద్ర భార్గవ్, రవికుమార్ వోడి అరపు దాఖలు చేశారు.

‘దివంగత విప్లవ గాయకుడు తనను సంప్రదించి కారు కావాలని కోరారని, దానికి ప్రతిఫలంగా తాను ఆయనకు కారును బహూకరించానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యను పూర్తిగా “అసత్యం, కల్పితం, పరువు నష్టం క‌లిగిస్తున్నాయ‌ని, దళిత సమాజం, తెలంగాణ ఉద్యమ అభిమానుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమే ఇదని ఫిర్యాదుదారులు పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -