- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
భారీ వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంగళవారం ముధోల్ రైతులు తహశీల్దార్ శ్రీలత కు వినతిపత్రం అందజేశారు. ఎకరానికి రూ.30వేల చొప్పున నష్టపరిహారం అందివ్వాలని పేర్కొన్నారు. అతి భారీ వర్షాల కారణంగాపంట చేలల్లో ఇసుక పేరుకుపోయి వరదలకు కొట్టుకుపోయిన,దెబ్బతన్నయాని వారు తెలిపారు. నష్ట పోయిన ప్రతిరైతుకు నష్ట పరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రోళ్ల రమేష్ ,మండల బిజెపి అధ్యక్షులు కోరి పోతన్న, బిడిసిఅధ్యక్షులు విట్టల్, మాజీ సర్పంచ్ అనిల్, రైతులు, తదితరులు, పాల్గొన్నారు.
- Advertisement -