- Advertisement -
మండల ఎంపిడిఓ రామ్మూర్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ రామ్మూర్తి మాట్లాడారు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానుభావుడు కాళోజిని,ఆయన రచనలు, ఆలోచనలు సామాజిక చైతన్యానికి దారితీశాయన్నారు.కాళోజి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలనే సంకల్పం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -