- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు(మహముత్తారం)
మహముత్తారం మండలంలో రేపు శుక్రవారం పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ప్రారంబించనున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పక్కల సడవలి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మహ ముత్తారం మండలంలో రూ.2 కోట్ల 30 లక్షలతో నిర్మించిన కస్తూరిబ్బా జూనియర్ కళాశాల, బోర్ల గూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవనం శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు.
- Advertisement -