– పార్టీ నాయకత్వానికి పంది రాజు కృతజ్ఞతలు
నవతెలంగాణ – తొగుట
కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పంది రాజు కృతజ్ఞ తలు తెలిపారు. బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పంది రాజు నియామకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేస్తున్నామన్నారు.
నా నియామకానికి సహకరిం చి, నన్ను ప్రోత్సహించిన ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డికి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ అమర్ రెడ్డికి, తాజా మాజీ అధ్య క్షులు అక్కం స్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలి పారు. పార్టీ నాయకత్వానికి నపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నిబద్ధతతో పని చేస్తానని అన్నారు. మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా నని చెప్పారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి కార్యకర్తను కలుపుకుని ప్రజా సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరం తరం శ్రమిస్తానని తెలిపారు.



