- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
శాస్త్రీయ సోషలిజాన్ని కోరిన వ్యక్తి సీతారాం ఏచూరి అని సీపీఐ(ఎం) నాయకులు అన్నారు. శుక్రవారం రాత్రి అమరచింత పట్టణంలో పాత బస్టాండ్ దగ్గర కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూల దండ వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటు పాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకటేష్,మండల నాయకులు అజయ్, బుచ్చన్న శ్రీను మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -