- Advertisement -
నవతెలంగాణ-నవాబు పేట: మండల కేంద్రంలోని మన గ్రోమోర్ కేంద్రం లైసెన్స్ సస్పెండ్ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి కృష్ణ కిషోర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గ్రోమోర్ కేంద్రంలో గత రెండు రోజుల క్రితం రైతులకు వచ్చిన యూరియా అమ్మడంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన టోకెన్ల విషయంలో 90 మంది రైతులకు ఇచ్చిన టోకెన్ల పరంగా యూరియా ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చి టోకెన్లు ఇచ్చిన రైతులకు ఇబ్బందులకు గురి చేశారని జిల్లా వ్యవసాయ అధికారి దృష్టికి రావడంతో మన గ్రోమోర్ కేంద్రం లైసెన్సును సస్పెండ్ చేసినట్లు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
- Advertisement -