Monday, July 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం

వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని గుర్జకుంట గ్రామంలో వ్యవసాయ బావుల వద్ద ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఐదు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమైనట్లు గుర్తించి విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -