Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెర్కిట్ లో వ్యవసాయ అధికారుల క్షేత్ర పర్యటన 

పెర్కిట్ లో వ్యవసాయ అధికారుల క్షేత్ర పర్యటన 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో పంటల పరిస్థితిని అంచనా వేయడానికి సోమవారం మండల వ్యవసాయ అధికారి హరి కృష్ణ క్షేత్ర పర్యటన  నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు చింతకుంట నాగరాజు, పాలేపు రెడ్డి, రాజ్‌పాల్‌ల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, వారు సాగు చేస్తున్న వరి నాట్లు, పసుపు , మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలపై పడే ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి, రైతులు తీసుకోవాల్సిన సాగు నిర్వహణ చర్యలు, తేమ సంరక్షణ పద్ధతులు, నీటి వినియోగంలో పొదుపు, కలుపు నియంత్రణ, సమతుల్య ఎరువుల వినియోగం తదితర అంశాలపై రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు.రైతుల సమస్యలు, అవసరాలు , సూచనలను తెలుసుకొని నమోదు చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో గమనించిన పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి, అవసరమైన చర్యలు చేపట్టేలా నివేదికలు సమర్పించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు.  రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, శాఖ సూచించిన శాస్త్రీయ సలహాలను పాటించి పంటలను సంరక్షించుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు నిషికాంత్, రమ్య, రోచన, అనూష రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -