Monday, August 3, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణలో రేపటి నుంచి కొత్త స్కీమ్ అమలు..

తెలంగాణలో రేపటి నుంచి కొత్త స్కీమ్ అమలు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో జులై 15 నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం ‘ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (EHS) పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఈ నగదు రహిత వైద్య విధానం కింద క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయనున్నారు. అర్హులు ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో నగదు చెల్లించకుండానే వైద్య సేవలు పొందవచ్చు. ఉద్యోగుల సౌకర్యార్థం ‘ఈహెచ్‌సీటీ’ (EHCT) యాప్‌ను కూడా రూపొందిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒకరి జీతం నుంచే చందా మినహాయింపు ఉంటుంది. పథకం అమలుకు అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -