- Advertisement -
నవతెలంగాణ – చండూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం చండూరు మండల అధ్యక్షులుగా గోన సత్యనారాయణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం పట్టణంలో ఆ ఉద్యోగుల కమిటీ నిర్వహించారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా గాలంక జీవరత్నం , ప్రధాన కార్యదర్శిగా ఐటిపాముల రాజలింగం , కోశాధికారిగా పోలా జగతయ్య, ఉపాధ్యక్షులుగా జి విష్ణుమూర్తి, ఎన్ శేఖర్ , జాయింట్ కార్యదర్శి గ పెండ్యాల బాబురావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇ శ్రీనివాసులు , ప్రచార కార్యదర్శిగా కె నారాయణ రెడ్డి లు ఎన్నికైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
- Advertisement -