- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
మండలంలోని దూపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు బతుకమ్మ సంబరాలను తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా జరిపారు. విద్యార్థినీ విద్యార్థులు రంగురంగుల పూలను సేకరించి బతుకమ్మలను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవరెడ్డి, పిఆర్టియు మండల అధ్యక్షులు టి సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, కృష్ణ, రాజేశ్వర్, సాయన్న తదితరులు పాల్గొనగా, విద్యార్థులు సాంప్రదాయమైన దుస్తులను ధరించి బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరిపారు.
- Advertisement -