Monday, September 22, 2025
E-PAPER
Homeఆటలురాజీవ్‌గాంధీకి క్రీడలపై మక్కువ

రాజీవ్‌గాంధీకి క్రీడలపై మక్కువ

- Advertisement -

పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌ : రాజీవ్‌గాంధీ డిసెబిలిటీ టీ20 చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఘనంగా ఆరంభమైంది. టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై డిసెబిలిటి టీ20 టోర్నీని ఆరంభించారు. ‘రాజీవ్‌గాంధీకి క్రీడలపై మక్కువ. ఆయన పేరుతో డిసెబిలిటి టోర్నమెంట్‌ నిర్వహణ హర్షనీయం. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఫోర్త్‌ సిటీలో ఉప్పల్‌ తరహాలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. పిల్లలు క్రీడలపై దృష్టి సారించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని’ ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -