- Advertisement -
ఈఎల్పీ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగుదిండ్ల భాస్కర్
నవతెలంగాణ -చండూరు
రాజకీయాలకు అతీతంగా సమాజసేవ చేయడమే లక్ష్యమని ఈఎల్ వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగు దిండ్ల భాస్కర్ అన్నారు. గురువారం గట్టుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దసరా ఉత్సవాల పోస్టరును ఆవిష్కరించి మాట్లాడారు. దసరా ఉత్సవాల సందర్భంగా సంస్కృతి, సంప్ర దాయాలు తెలిసేలా కళాకారులతో సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొ ననున్నట్లు తెలిపారు.
- Advertisement -