- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో మహిళలతో వేద పండితులు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని వేద పండితులు శుక్రవారం మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలతో సామూహిక కుంకుమార్చన చేయించారు.
- Advertisement -