- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పరమహంస పరివ్రాజక బాలయోగి శ్రీ రాములు మహారాజు లోక కళ్యాణార్థం పరమశివుని ఆశీస్సులతో గత 39 సంవత్సరాలుగా అనుష్ఠాన దీక్షను చేయడం జరుగుతుందని కేదారేశ్వర ఆశ్రమ కమిటీ సభ్యులు సాయి కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. అందులో భాగంగా 40 వ అనుష్టాన దీక్ష విజయదశమి పర్వదినం రోజున గురువారం ఉదయం 9.45 నిమిషాలకు ప్రారంభిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. సమస్త భక్తజనులందరూ ఈ అనుష్టాన దీక్ష ప్రారంభోత్సవ వేడుకలకు మహారాజు యొక్క ఆశీస్సులు అనుగ్రహం పొందాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.
- Advertisement -