- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో మంగళవారం కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమాలయంలో నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారికి ప్రతినిత్యం ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రులలో భాగంగా ఆలయం వద్ద నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్న వితరణలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భోజనాలు చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -