- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు శనివారం మండలంలోని మల్లంపల్లి ఎంపీటీసీ క్లస్టర్ సమావేశాన్ని హట్య తండాలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో సబండ వర్గాలకు అన్యాయం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోతు మహేందర్, మండల కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, నాయకులు రవి వర్మ, అజ్మీర వెంకన్న, శ్రీను, రవి అశోక్ నాగుల్ యాకు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -