- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ టీఎస్ఆర్టీసీ బస్టాండ్ శనివారం ప్రయాణికులతో రద్దీగా మారింది. దసరా సెలవులు ముగియడంతో ప్రయాణికులు తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఆర్మూర్ నుంచి హైదరాబాద్, భీంగల్, నందిపేట్, నిజామాబాద్ తదితర మార్గాలలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడుపుతున్నట్లు టిఎస్ఆర్టిసి డిఎం రవికుమార్ తెలిపారు.
- Advertisement -