11న ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ ధర్నా

– సంక్షేమపథకాలు పేదలకు అందించాలి
– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 11న అన్ని మండల కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో వేములపల్లి ఉమ్మడి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వాలు ప్రజల దష్టి మార్చేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే, పెరిగిన ధరలతో అల్లాడిపోతుంటే ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇండియా పేరును భారత్‌గా మరుస్తున్న విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేక పవనాలు విస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు సొంత పార్టీ కార్యకర్తలకు ఇస్తూ నిజమైన పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.గ్రామాల్లో వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దష్టి సారించి పరిష్కరించాలని కోరారు. ప్రజా వ్యతిరేక విత్తనాలపై పార్టీ పిలుపుమేరకు గ్రామాల్లో వార్డులలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈనెల 10 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నామనితెలిపారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, వేములపల్లి, మాడ్గులపల్లి మండలాల కార్యదర్శులు పాదూరు శశిధర్‌రెడ్డి, రొండి శ్రీనివాస్‌, జిల్లా కమిటీ సభ్యుడు ఆర్‌.పరుశరాములు,మండల కమిటీ సభ్యులు నాగిరెడ్డి,భిక్షం,పతాని శ్రీను,బొంగరాల వెంకటయ్య,ఏసు బాబు,నాగమణి,వెంకన్న,యల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love