- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని జామ్ గ్రామం కెఎన్ఆర్ ట్రస్టు అధినేత (బీసీ) మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది కోర్వ నవీన్ రెడ్డి నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. తాను చాలా కాలంనుండి కాంగ్రెస్ పార్టీ లో పని చేసాను. అధిష్టానం గుర్తించి పదవిని కట్టబెడితే పూర్తి గా పార్టీకి పనిచేసేందుకు ముందుంటని వెల్లడించారు. ఇదివరకు ట్రస్టు ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
- Advertisement -