Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటుచోరీ పద్ధతిలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది

ఓటుచోరీ పద్ధతిలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది

- Advertisement -

టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
ఓటు చోరీ పద్ధతిలోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడు సార్లు అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఓటు చోరీపై సంతకాల సేకరణను సోమవారం అచ్చంపేటలో నిర్వహించారు. బీజేపీ చేసిన ఓటు చోరీలపై ప్రజలకు అవగాహన కల్పించేలా నిర్వహిస్తున్న సంతకాల సేకరణ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ చత్రు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, కాశన్న యాదవ్, నాయకులు సునీల్, రమేష్, అంజి, మల్లేష్, స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -