Tuesday, June 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల విత్తనాలకే రూ.500 బోనస్

ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల విత్తనాలకే రూ.500 బోనస్

- Advertisement -

– మండల వ్యవసాయ అధికారిణి రమ్యశ్రీ 
– విత్తన మేళను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల విత్తనాలకే క్వింటాకు రూ.500 బోనస్ లభిస్తుందని మండల వ్యవసాయ అధికారిణి రమ్యశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విత్తన మేళను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి రమ్యశ్రీ మాట్లాడుతూ రైతులు డిమాండ్ లేని వరి రకాలను సాగు చేసి నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు.

ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం బోనస్ చెల్లింపునకు అర్హత పొందిన ఏడు వరి రకాలను మాత్రమే రైతులు సాగు చేయాలని సూచించారు. బీపీటీ–5204 (సాంబ మసూరి), ఆర్‌ఎన్‌ఆర్–15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరామ్ ఏఎన్‌ఎం–1638 (కూనారం సన్నాలు), డబ్ల్యూజీఎల్–44 (సిద్ది), కేఎన్‌ఎం–7715 తదితర రకాల వరి విత్తనాలను సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున అదనపు ప్రోత్సాహక బోనస్ అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఈ నిర్ణీత రకాల విత్తనాలు మండలంలోని అన్ని ఎరువులు, విత్తనాల దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమైన రైతులు వాటిని కొనుగోలు చేసి సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్‌, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రవి, రమేష్, డీలర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -