నవతెలంగాణ – మల్హర్ రావు
వ్యవసాయ సమాచారం, పథకాలు,సేవలను రైతులకు చేరువలో అందించేందుకు రైతు వేదికలు కీలకంగా మారాయి.వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు రైతు వేడుకల్లో ఏర్పాటు చేశారు.మండల తాడిచెర్ల,కొయ్యుర్ గ్రామాల్లోని రైతువేదికల్లో ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి “సీడ్ మేళ” కార్యక్రమాన్ని మంగళవారం కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ,ఏఈఓ లు అనూష,పృత్వి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాల నాణ్యమైన బోనస్ వరి విత్తనాలను పంపిణీ చేశారు.
అలాగే నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడారు ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించడంతో పాటు సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు.రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఖరీఫ్ సీజన్‌ను విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.



