Tuesday, June 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్ఓలకు, బీఎల్ఏలకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించామని తహశీల్దార్ మారుతి, డిప్యూటీ తహశీల్దార్ హేమలత, ఆర్ఐ మోహన్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా, తప్పులు లేకుండా నిర్వహించాలని చెప్పారు. ఇందుకు ఎమ్యూనరేటర్లు గ్రామాల్లోని కార్యదర్శుల సహకారంతో, సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. సర్వే అధికారులకు ప్రతి ఒక్కరు సహకరించి, ఎస్ఐఆర్ ప్రకియను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్వో తోపాటు డిప్యూటీ తహసిల్దార్, అర్ ఐ మోహన్ , ఇబ్బంది శ్రీనివాస్, సాయికుమార్, బి ఎల్ వో లు, జిపిఓ లు, జిపి కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -