Tuesday, August 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాకర్ల పహాడ్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

కాకర్ల పహాడ్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
మండల పరిధిలోని కాకర్ల పహాడ్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా అదనపు, స్థానిక సంస్థల కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థులతో తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి మౌళిక సదుపాయాలు లేకున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాఠశాల ఆవరణలో నిర్మాణం జరుగుతున్న భవనాన్ని పరిశీలించి వేంటనే పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -